బ్యాంకు సెక్యూరిటీ గార్డు తుపాకీ ప్రమాదవశాత్తూ నేలపై పడి పేలడంతో.. ఐదుగురు కాలేజీ అమ్మాయిలు సహా ఆరుగురు మహిళలకు పెల్లెట్ గాయాలయ్యాయి. మంగళవారం బ్యాంకు వద్ద ఉన్న జనాన్ని అదుపు చేసేందుకు గార్డు ప్రయత్నిస్తుండగా మొగల్‌పురా ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన బాలికల కుటుంబీకులు బ్యాంకు బయట గుమిగూడి నిరసన తెలిపారు. గార్డును అదుపులోకి తీసుకున్నామని, అతని తుపాకీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. కొంతమంది కాలేజీ అమ్మాయిలతో సహా దాదాపు 60 మంది కస్టమర్లు స్కాలర్‌షిప్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చారు. వారు బ్యాంకు శాఖ వెలుపల గుమిగూడారు. కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం ఒకేసారి 10 మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. గేటు తెరవగానే పలువురు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గార్డుతో వాగ్వాదం జరిగింది. తదనంతర కొట్లాటలో గార్డు యొక్క 12 బోర్ గన్ నేలపై పడి పోయింది. గాయపడిన వారిని రూబీ ఖాన్ (35), రాణి, 18, మీరా, 21, రాఖీ రస్తోగి, 20, మేఘా సైనీ, 20, జ్వాలా (22)గా గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం కత్‌ఘర్ సర్కిల్ అధికారి అశుతోష్ తివారీ తనిఖీలు నిర్వహించి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచారు. గార్డు సూచనలను పాటిస్తున్నట్లు తెలిపిన బ్యాంక్ మేనేజర్ వాంగ్మూలాన్ని మేము రికార్డ్ చేసాము. ఇది ఉద్దేశపూర్వక చర్య అని చెప్పడానికి మేము ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. అతను ఉండగానే తుపాకీ నేలపై పడినట్లు సీపీటీవీ ఫుటేజీ చూపిస్తుంది. గుంపును నియంత్రించేందుకు ప్రయత్నించగా అది కిందపడి పేలింది. అదృష్టవశాత్తూ ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. బాధితులెవరూ ఇంకా ఫిర్యాదు చేయలేదు. నిర్లక్ష్యానికి గార్డుపై మేము ఎఫ్‌ఆఐర్ నమోదు చేస్తాము." అని అన్నారు.