Train Accident : బిలాస్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని లాల్‌ఖాదన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

By -  Medi Samrat
Published on : 4 Nov 2025 5:21 PM IST

Train Accident : బిలాస్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని లాల్‌ఖాదన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా మార్గంలో నడుస్తున్న ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు పెద్దఎత్తున ఢీకొన్నాయి. ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. కోర్బా ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీకొన్నఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. రైల్వే అధికారులు, ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ జరుగుతోంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.



రైలులోని పలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానిక యంత్రాంగం కూడా సహాయం కోసం ముందుకు వచ్చింది. ప్రమాదం కారణంగా మొత్తం మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా రైళ్లు రద్దు చేయబడగా.. కొన్ని దారి మళ్లించబడ్డాయి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రెస్క్యూ జరుగుతోంది. ఘటనా స్థలంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. అత్యంత రద్దీగా ఉండే బిలాస్‌పూర్ కట్నీ రైల్వే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది విచారణ తర్వాతే తేలనుంది.

Next Story