ఆ ఇంటి వాటర్ ట్యాంక్ లోకి తొంగి చూసిన అధికారులు షాక్ అయ్యారు..!

6 crore rupees found in liquor businessman's house. ఆదాయపు పన్ను శాఖ అధికారులు అక్రమార్కుల ఇళ్లకు రైడింగ్ కు వెళ్లిన సమయాల్

By Medi Samrat  Published on  7 Jan 2022 10:25 AM GMT
ఆ ఇంటి వాటర్ ట్యాంక్ లోకి తొంగి చూసిన అధికారులు షాక్ అయ్యారు..!

ఆదాయపు పన్ను శాఖ అధికారులు అక్రమార్కుల ఇళ్లకు రైడింగ్ కు వెళ్లిన సమయాల్లో డబ్బు, నగలు, పత్రాలు వంటివి దాచడానికి ఒక్కొక్కరు.. ఒక్కో రకమైన మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి ఘటనలు చాలా వరకూ వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. ఇంకొందరు చేసిన పనులకు అధికారులు కూడా షాక్ అవుతూ ఉంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్‌లో మద్యం వ్యాపారి శంకర్ రాయ్, అతని సోదరుల ఇళ్లపై నిర్వహించిన దాడులలో ఆదాయపు పన్ను శాఖ లెక్కల్లో చూపని సంపద, పన్ను ఎగవేతలకు సంబంధించిన సమాచారాన్ని సొంతం చేసుకుంది. శంకర్ రాయ్ సోదరుడు సంజయ్ రాయ్ దగ్గర రూ.3 కోట్లు, కమల్ రాయ్ దగ్గర రూ. 2.5 కోట్లు దొరికాయి. దీంతో పాటు రూ.3 కోట్ల విలువైన నగలు దొరికాయి. పత్రాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు.

ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ మున్మున్ శర్మ ప్రకారం, రాయ్ సోదరులు ఈ దాడిని ముందే పసిగట్టారు. రూ.3కోట్లు ప్లాస్టిక్ సంచుల్లో నింపి వాటర్ ట్యాంక్ లో దాచారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాటర్ ట్యాంక్‌లోకి దిగి ఈ ప్లాస్టిక్ సంచుల నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో దాదాపు 100 మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులు 50 వాహనాల్లో రాయ్ సోదరుల ఇళ్లపై దాడులు చేశారు. 6 కోట్ల నగదు, 3 కిలోల బంగారం, జాగ్వార్, ఆడి, ల్యాండ్‌రోవర్ తదితర కార్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయ్ సోదరులు ఆస్తులు సంపాదించి పన్నులు దోచుకున్నారనే విషయమై పేపర్లను పరిశీలిస్తున్నారు. రాయ్ సోదరులకు మద్యం వ్యాపారంతో పాటు హోటల్, రవాణా వ్యాపారం కూడా ఉంది. వారికి అనేక బస్సులు ఉన్నాయి. పెట్రోలు పంపులు దామోహ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్వహించబడుతున్నాయి.


Next Story