నలందా మెడికల్‌ కాలేజీలో కలకలం.. మరో 59 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్‌

59 more doctors at NMCH Patna test COVID positive. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో కరోనా కలకలం రేపుతోంది. నలందా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఎన్‌ఎంసిహెచ్)కి చెందిన మరో 59 మంది

By అంజి  Published on  5 Jan 2022 3:20 AM GMT
నలందా మెడికల్‌ కాలేజీలో కలకలం.. మరో 59 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్‌

బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో కరోనా కలకలం రేపుతోంది. నలందా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఎన్‌ఎంసిహెచ్)కి చెందిన మరో 59 మంది వైద్యులకు కోవిడ్-19కి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారులు మంగళవారం తెలిపారు. ఎన్‌ఎంసిహెచ్‌కి చెందిన 159 మంది వైద్యులు ఇప్పటికే వైరస్ బారిన పడ్డారు. కొత్త పాజిటివ్‌ కేసులు ఈ సంఖ్యను పెంచుతున్నాయి. అంతకుముందు ఆదివారం.. పాట్నా డిఎం చంద్రశేఖర్ సింగ్ ఆసుపత్రికి చెందిన 87 మంది వైద్యులకు కొవిడ్‌-19 కు పాజిటివ్ నిర్దారణ అయ్యిందని తెలియజేశారు. దీని తరువాత, ఎన్‌ఎంసిహెచ్ యొక్క మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బినోద్ కుమార్ సింగ్ సోమవారం నాడు.. ఎన్‌ఎంసిహెచ్ యొక్క మరో 72 మంది వైద్యులు కొవిడ్‌-19 కు పాజిటివ్ పరీక్షించారని కేసుల సంఖ్యను 159 కి తీసుకువెళ్లారని తెలిపారు.

డాక్టర్లు వరుసగా కరోనా బారినపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌ వచ్చిన డాక్టర్లతో కలిసి పని చేసిన వారిని అధికారులు గుర్తిస్తున్నారు. కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్‌ కనిపిస్తోంది. బీహార్‌ రాజధాని పాట్నాలో మంగళవారం 565 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 893 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం ఆంక్షలు అమలు చేస్తోంది.

Next Story