రాష్ట్ర ప్రజల కోసం రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో నెలకు 100 యూనిట్ల విద్యుత్తు వినియోగించే వారికి మాత్రమే నెలకు 50 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గృహ వినియోగదారులందరికీ 150 యూనిట్ల వరకు వినియోగానికి యూనిట్‌కు రూ.3, అలాగే.. 150 నుండి 300 యూనిట్ల వరకు వినియోగానికి యూనిట్‌కు రూ.2 చొప్పున అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా 1.18 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
అలాగే.. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చిరంజీవి హెల్త్ స్కీమ్ బీమా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు ప్రకటించింది. దీని ద్వారా 1.34 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఇజిఎ పథకం కింద 100 రోజులకు బదులు 125 రోజులు ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీడీ, ఐపీడీలు ఏప్రిల్ 1 నుంచి నెల రోజుల పాటు ఉచితంగా ఉంటాయని.. మే 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు నెల రోజుల పాటు ట్రయల్ పీరియడ్ నిర్వహించి.. ఆ తర్వాత ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.