గుడిలో ప్రసాదం తిని.. అస్వస్థతకు గురైన 50 మంది భక్తులు

50 fall ill after eating ‘prasad' in Karnataka. కర్నాటకలోని కోలార్ జిల్లాలోని ఒక దేవాలయంలో అందించే ‘ప్రసాదం’ సేవించి కనీసం 50 మంది అస్వస్థతకు గురయ్యారు. జనవరి 1న శ్రీనివాసపుర తాలూకాలోని బీరగనహళ్లిలోని ఓ ఆలయంలో జరిగిన వేడుకలో ఈ ఘటన జరిగింది.

By అంజి  Published on  2 Jan 2022 2:58 PM GMT
గుడిలో ప్రసాదం తిని.. అస్వస్థతకు గురైన 50 మంది భక్తులు

కర్నాటకలోని కోలార్ జిల్లాలోని ఒక దేవాలయంలో అందించే 'ప్రసాదం' సేవించి కనీసం 50 మంది అస్వస్థతకు గురయ్యారు. జనవరి 1న శ్రీనివాసపుర తాలూకాలోని బీరగనహళ్లిలోని ఓ ఆలయంలో జరిగిన వేడుకలో ఈ ఘటన జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు మధ్యాహ్నం 'చిత్రాన్న', 'కేసరిబాత్‌' వంటి స్థానిక వంటకాలను 'ప్రసాదం'గా అందించారు. అయితే ప్రసాదం సేవించిన వారికి తీవ్ర వాంతులు అయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

'ప్రసాదం' సేవించిన ఇతరులు తమను తాము తనిఖీ చేసుకోవడానికి ముందుకు రావడంతో ఇది సంఘంలో గందరగోళానికి దారితీసింది. స్వల్పంగా వ్యాధి లక్షణాలు ఉన్న వారికి వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించారు. కాగా శుక్రవారం అందించిన 'ప్రసాదం' నమూనాలను ఆరోగ్యశాఖ సేకరించింది. ఆ ప్రాంతంలోని నీటి స్వచ్ఛతను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మరికొంత మందిని విచారణకు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Next Story