లోయ‌లో ప‌డ్డ ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో పెను ప్రమాదం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. పూంచ్‌లో నియంత్రణ రేఖ దగ్గర ఆర్మీ వాహనం లోయ‌లో పడిపోయింది.

By Medi Samrat  Published on  24 Dec 2024 8:46 PM IST
లోయ‌లో ప‌డ్డ ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో పెను ప్రమాదం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. పూంచ్‌లో నియంత్రణ రేఖ దగ్గర ఆర్మీ వాహనం లోయ‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు మరణించారు. అందిన సమాచారం ప్రకారం.. ఆర్మీ వాహనం లోతైన లోయ‌లో పడిపోయింది. స‌మాచారం అందుకున్న పలువురు పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించి ఆర్మీ అధికారులు మంగళవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో వాహనం రోడ్డుపై నుంచి జారి లోయ‌లో పడడంతో ఐదుగురు సైనికులు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. జిల్లాలోని బనోయి వైపు ఆర్మీ వాహనం వెళ్తుండగా ఘరోవా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు.

రెస్క్యూ టీం ఐదుగురి మృతదేహాలను వెలికితీసింది. వాహనం దాదాపు 300-350 అడుగుల లోయ‌లో ఉన్న గోతిలో పడిపోయిందని తెలిపారు. గాయపడిన సైనికులను తక్షణ చికిత్స కోసం సమీప వైద్య సదుపాయాలకు తరలించేందుకు ఆర్మీ ద్వారా రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.

Next Story