భవనంలో చెలరేగిన మంటలు.. ఐదుగురు సజీవ దహనం
5 dead as fire breaks out at wedding venue in UP. వైభవంగా జరుగుతున్న ఓ పెళ్లి వేడుక. అందరూ వివాహ వేడుకలో మునిగిపోయారు. కానీ మూడంతస్తుల
By అంజి Published on 26 Aug 2022 9:50 AM ISTవైభవంగా జరుగుతున్న ఓ పెళ్లి వేడుక విషాదం నెలకొంది. మూడంతస్తుల ఆ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొంతమంది మంటల్లో చిక్కుకున్నారు. మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవ దహనం అయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో గురువారం రాత్రి జరిగింది. అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి ఐదు అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
మంటల నుంచి ఏడుగురిని స్థానికులు రక్షించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం. మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయని మొరాదాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురిని భవనంపై నుంచి రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మృతి చెందిన వారందరు ఒకే కుటుంబానికి చెందిన వారు.
అగ్నిమాపక శాఖ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తోంది. మృతుల్లో కనీసం ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని జిల్లా ఆసుపత్రి అత్యవసర వైద్యాధికారి తెలిపారు. మరణాలు ప్రాథమికంగా అగ్ని ప్రమాదం కారణంగా జరిగాయని చెప్పారు. "మేము ఇంకా వివరాలను నిర్ధారించలేదు. ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు సహా నలుగురిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి." అని జిల్లా ఆసుపత్రి మొరాదాబాద్‌లోని అత్యవసర వైద్య అధికారి సురీందర్ సింగ్ తెలిపారు.