అరుణాచల్ ప్రదేశ్ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

5 dead after Army chopper crashes in Arunachal's Upper Siang. అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో శుక్రవారం భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన

By Medi Samrat  Published on  21 Oct 2022 6:15 PM IST
అరుణాచల్ ప్రదేశ్ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో శుక్రవారం భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ఐదుగురు మరణించారు. ఇద్దరు పైలట్‌లతో సహా ఐదుగురు వ్యక్తులు హెచ్‌ఏఎల్ రుద్ర అనే అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌లో ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి రెస్క్యూ టీమ్‌ను పంపించారు. శుక్రవారం సాయంత్రానికి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు సైన్యం సమాచారం అందించింది.

శుక్రవారం ఉదయం లికబాలి పట్టణం నుండి బయలుదేరిన హెలికాప్టర్ వెంటనే సింగింగ్ గ్రామం సమీపంలో కూలిపోయింది. ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లేందుకు ఎలాంటి రోడ్లు లేకపోవడంతో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపించారు. స్థానిక గ్రామస్తులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.


Next Story