ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో హిడ్మా ఉన్నట్లు సమాచారం. హిడ్మా ఉన్నాడనే సమాచారంతోనే సీఆర్పీఎఫ్ దళాలు కూంబింగ్ చేపట్టాయి. కూంబింగ్ సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలోని తుంబహకా వద్ద నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐఇడి పేలుడులో ఐదుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని రాంచీలోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. వీరంతా CRPF కోబ్రా బెటాలియన్‌కు చెందినవారు. టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంబహాకలో సీఆర్పీఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహిస్తుండగా నక్సల్స్ ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు.