ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో విషాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. తమిళనాడులోని సేలంలో జరిగిన ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. సభలో విజయం మాట్లాడుతుండగా ఒక వ్యక్తి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతి చెందిన వ్యక్తిని మహారాష్ట్రకు చెందిన 37 ఏళ్ల సూరజ్‌గా గుర్తించారు. మృతుడు సేలంలోని సెవ్వైపట్టై ప్రాంతంలో నివసిస్తున్నాడు.