కొవిడ్ బులిటెన్‌.. దేశంలో భారీగా త‌గ్గిన కేసులు

34113 34113 New Corona Cases Reported In India New Corona Cases Reported In India. దేశంలో కొవిడ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా

By Medi Samrat  Published on  14 Feb 2022 7:14 AM GMT
కొవిడ్ బులిటెన్‌.. దేశంలో భారీగా త‌గ్గిన కేసులు

దేశంలో కొవిడ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 34,113 తాజా కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 75.18 కోట్ల పరీక్షలు నిర్వహించబడ్డాయి. గడిచిన‌ 24 గంటల్లో 10,67,908 పరీక్షలు జరిగాయి. దేశంలో ప్రస్తుతం క్రియాశీల పాజిటివ్ కేసుల సంఖ్య‌ 4,78,882 గా ఉంది. ఇది మొత్తం కేసులలో 1.12 శాతం. బులెటిన్ ప్రకారం భారతదేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతం మరియు వీక్లీ పాజిటివిటీ రేటు 3.99 శాతంగా నమోదైంది.

గత 24 గంటల్లో మొత్తం 91,930 మంది రోగులు కోలుకున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి కోలుకున్న రోగుల సంఖ్య 4,16,77,641 గా ఉందని బులెటిన్ పేర్కొంది. భారతదేశం రికవరీ రేటు ప్ర‌స్తుతం 97.68 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 346 మరణాలు నమోదయ్యాయి, మొత్తం మరణాల సంఖ్య 5,09,011కి పెరిగింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,72,95,87,490 వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి.


Next Story