ముగ్గురు తీవ్రవాదుల హతం

శనివారం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి

By Medi Samrat
Published on : 16 Sept 2023 6:18 PM IST

ముగ్గురు తీవ్రవాదుల హతం

శనివారం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ, పోలీసులు, నిఘా సంస్థలు సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అప్రమత్తమైన బలగాలు ముగ్గురు ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్నాయి. ఈరోజు తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి మృతదేహాలను వెలికితీశారు. మూడవ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. అతని మృతదేహాన్ని వెలికితీసేందుకు భారత భద్రతా బలగాలు ప్రయత్నించగా.. సమీపంలోని పాక్ పోస్ట్ ద్వారా కాల్పులు జరిపారు.

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ శనివారం 4వ రోజుకు చేరుకుంది. ఈరోజు భారీ పేలుడులు వినిపించాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం డ్రోన్‌తోనూ నిఘా పెట్టారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం, మరింత మంది ఉగ్రవాదుల కోసం బలగాలు వెతుకుతున్నాయి.

Next Story