తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సోమవారం ఉదయం పోలీసుల బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా, బీజాపూర్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సరిహద్దుల్లో తెలంగాణ పోలీస్, గ్రౌహౌండ్స్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే తర్లగూడ వద్ద పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాలు ఎదురెదురుగా కాల్పులు జరుపుకున్నారు.
ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు మృతదేహాలతో పాటు ఎస్‌ఎల్‌ఆర్, ఏకే-17 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలోనే వారి కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇటీవల మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. మావోయిస్టు పార్టీని తీవ్ర విషాదంలో నింపింది.