ట్రాన్స్‌ జెండర్‌తో ఏడడుగులు వేసిన యువకుడు..!

25 years old man married transgender in tamilanadu. ప్రేమకు కళ్లు లేవు అనేది మరోసారి నిరూపితమైంది. ప్రస్తుత జనరేషన్‌లో అనేక వివాహాలు కులం, మతం, జాతితో సంబంధం లేకుండా

By అంజి  Published on  29 Oct 2021 3:47 PM IST
ట్రాన్స్‌ జెండర్‌తో ఏడడుగులు వేసిన యువకుడు..!

ప్రేమకు కళ్లు లేవు అనేది మరోసారి నిరూపితమైంది. ప్రస్తుత జనరేషన్‌లో అనేక వివాహాలు కులం, మతం, జాతితో సంబంధం లేకుండా జరుగుతున్నాయి. తమిళనాడులో ఓ యువకుడు ట్రాన్స్‌జెండర్‌ మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కల్లకురిచి జిల్లా చింతాద్రిపేట్‌కు చెందిన 29 ఏళ్ల మనో అనే యువకుడు.. ట్రాన్స్‌ జెండర్‌ రియా గత కొన్ని రోజులుగా ప్రేమించుకున్నారు. ట్రాన్స్‌ జెండర్‌ రియా (25) చెన్నైలో ఉంటూ పని చేస్తుండేది. ఈ క్రమంలోనే చింతాద్రిపేటకు చెందిన మనోతో రియాకు పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లికి మనో తల్లిదండ్రులు అడ్డుగా ఉంటారనే ఆలోచన ఇద్దరికీ ఉండేది. దీంతో ఇద్దరూ కల్లకురిచి జిల్లా ఉలుందూరుపేటలోని ఓ అద్దె ఇంటికి మారారు.

ఆ తర్వాత స్నేహితుల ద్వారా పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. మంగళవాయిద్యాల మధ్య పెళ్లి వేదికపైకి వచ్చిన రియాకు మనో తాళికట్టి ప్రేమకు ప్రతీకగా నిలిచారు. కొత్త పెళ్లి జంటను ఆశీర్వదించేందుకు ట్రాన్స్‌ జెండర్లు పెద్ద ఎత్తున వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహానికి వధువరూల తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇలాంటి వివాహాలు ఎక్కువగా కోయంబత్తూరు, తూత్తుకూడి జిల్లాలో జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరి వివాహంపై సామాజిక కార్యకర్తలు, ఆలోచనాపరులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. లింగమార్పిడి చేయించుకునే కుత్తాండవర్‌ దేవాలయం ఉన్న ఉలుందూరుపేట ప్రాంతంలో వీరి పెళ్లి జరిగింది.

Next Story