దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం రాత్రి 9.30 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.5గా నమోదు అయినట్లు వెల్లడించింది. భూకంప కేంద్రం న్యూఢిల్లీకి పశ్చిమాన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో 5 కి.మీ లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
కాగా.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఈ నెలలో భూమి కంపించడం ఇది మూడోసారి. నవంబర్ రెండో వారంలో రెండు సార్లు భూ కంపాలు సంభవించాయి. నవంబర్ 9న, నవంబర్ 12న నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపాల ప్రభావం ఢిల్లీలోనూ కనిపించింది.