వంతెన పై నుంచి ఉప్పొంగుతున్న న‌దిలోకి దూకేశాడు.. వీడియో వైర‌ల్‌

23 Year old man dives from bridge into flooded river in Maharashtra.ఇటీవ‌ల కాలంలో కొంద‌రు యువ‌కులు చేసే ప‌నులు ఎవ్వ‌రికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2022 12:57 PM IST
వంతెన పై నుంచి ఉప్పొంగుతున్న న‌దిలోకి దూకేశాడు.. వీడియో వైర‌ల్‌

ఇటీవ‌ల కాలంలో కొంద‌రు యువ‌కులు చేసే ప‌నులు ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. ఓ ప‌క్క న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌గా ఓ యువ‌కుడు ధైర్యంగా వంతెన పై నుంచి న‌దిలోకి డైవ్ చేశాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. నీటి ఉధృతి కార‌ణంగా అత‌డు కొట్టుకుపోయాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకుంది.

గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా మ‌హారాష్ట్ర‌లోని మాలెగావ్‌లో గిర్నా న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. బ‌ధవారం ఓ వంతెన పైన ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు నిలబ‌డి వ‌ర‌ద ప్ర‌వాహాన్ని చూస్తున్నారు. అందులో 23 ఏళ్ల నయీమ్ అమీన్ అనే యువ‌కుడు కూడా ఉన్నాడు. అయితే.. అత‌డు స‌డెన్‌గా ఓ హీరోలాగా న‌ది ప్ర‌వాహంలోకి దూకేశాడు. కాసేపు ప‌క్క‌న ఉన్న వారికి ఏం జ‌రిగిందో అర్థం కాలేదు. అప్ప‌టికే న‌ది ప్ర‌వాహం కార‌ణంగా నయీమ్ కొట్టుకుపోయాడు. స‌మాచారం అందుకున్న అధికారులు అక్క‌డ‌కు చేరుకుని అత‌డి కోసం గాలింపు చేప‌ట్టారు. గురువారం రాత్రి వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతడు బ్ర‌తికే ఉన్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్ర‌స్తుతం యువ‌కుడు న‌దిలోకి దూకిన సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అరె ఏంట్రా ఇది.. ఇలా చేశావు అంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుణె, నాసిక్‌తో పాటు మరో మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌డంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పాల్ఘర్ జిల్లా వసాయ్ నగరంలో నిన్న కొండచరియలు విరిగిపడి ఓ వ్య‌క్తి, అత‌డి కూతురు మ‌ర‌ణించింది.

Next Story