రైల్వే బ్రిడ్జికి పగుళ్లు.. 23 లోకల్ రైళ్లు రద్దు

23 local trains diverted, Tamil Nadu after cracks in railway bridge. చెన్నై నుండి కాట్పాడికి వెళ్లే 23 రైళ్లు.. రైల్వే బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడిన కారణంగా రద్దు చేయబడ్డాయి.

By అంజి  Published on  25 Dec 2021 11:20 AM GMT
రైల్వే బ్రిడ్జికి పగుళ్లు.. 23 లోకల్ రైళ్లు రద్దు

చెన్నై నుండి కాట్పాడికి వెళ్లే 23 రైళ్లు.. రైల్వే బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడిన కారణంగా రద్దు చేయబడ్డాయి. బ్రిటీష్‌ పాలనా కాలంలో ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ ఒక ట్వీట్‌లో, "అరక్కోణం-కాట్పాడి సెక్షన్‌లోని బ్రిడ్జి నెం. 299లో వంతెన నిర్మాణాత్మకంగా దెబ్బతినడంతో ట్రాఫిక్‌ను నిలిపివేసినందున, ఈ క్రింది విధంగా రైలు సర్వీసుల సరళిలో మార్పు వచ్చింది. రద్దు, మళ్లింపు. దయచేసి మీ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేయండి." అని చెప్పారు. డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ ఎం) గణేష్ నిపుణులతో సంఘటనా స్థలానికి చేరుకుని వంతెనను పరిశీలించారు.

డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రకారం.. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం, పొన్నై నది పొంగి ప్రవహించడం వల్ల వంతెన దెబ్బతింది. నిపుణులు కూడా పరిస్థితిని తనిఖీ చేస్తున్నారని, ఈ స్ట్రెచ్‌పై ఉన్న వంతెనలను అంచనా వేస్తారని ఆయన చెప్పారు. దెబ్బతిన్న వంతెనకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. వరదల కారణంగా ఇతర ప్రాంతాల్లోని రైల్వే వంతెనలు దెబ్బతిన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

డీఆర్‌ఎం గణేష్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎలాంటి దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేయలేదని, చెన్నై నుంచి కాట్పాడి, వేలూరు, జోలార్‌పేటకు వెళ్లే షార్ట్‌ డిస్టెన్స్‌ రైళ్లను మాత్రమే రద్దు చేసినట్లు తెలిపారు. "త్వరలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి మేము వీలైనంత వేగంగా పని చేస్తున్నాము. మేము శిధిలాలను సరిచేయడమే కాకుండా మొత్తం వంతెనను పరిశీలిస్తున్నాము. పూర్తి తనిఖీ తర్వాత మాత్రమే, ట్రాఫిక్ పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందో చెప్పగలము" అని గణేష్ తెలిపారు.


Next Story