అమరులైన భారత జవాన్లు

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు

By Medi Samrat  Published on  14 Sep 2024 2:48 AM GMT
అమరులైన భారత జవాన్లు

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జాయింట్ ఆర్మీ, పోలీసు బృందం ఛత్రూ బెల్ట్‌లోని నైద్‌ఘమ్ ప్రాంతంలో కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించినప్పుడు తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఛత్రూ పోలీస్ స్టేషన్ పరిధిలోని నైద్‌ఘం గ్రామం ఎగువన ఉన్న పింగల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ టీమ్ పై కాల్పులు జరిపారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. వీరిలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ నాయబ్ సుబేదార్ విపన్ కుమార్, సిపాయి అరవింద్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, ఆ ప్రాంతంలో ఆపరేషన్లు కొనసాగుతున్నాయని భారత సైన్యం తెలిపింది. గాయపడిన సైనికులను స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆర్మీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Next Story