కొత్తగా మరో వ్యాక్సిన్.. ఇది డీఎన్ఏ ఆధారిత టీకా

1st Covid Vaccine For Children Above 12 Approved In India. ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వైరస్ ను అడ్డుకోవడం కోసం తయారు చేసిన డీఎన్ఏ

By Medi Samrat  Published on  21 Aug 2021 1:07 PM GMT
కొత్తగా మరో వ్యాక్సిన్.. ఇది డీఎన్ఏ ఆధారిత టీకా

ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వైరస్ ను అడ్డుకోవడం కోసం తయారు చేసిన డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి ఇచ్చింది. జైడస్-కాడిలా వ్యాక్సిన్ పిల్లలకు కూడా ఇవ్వబడుతుంది. 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఉపయోగించడానికి ఇది వర్తిస్తుంది. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా (క్యాడిలా హెల్త్‌కేర్) తయారు చేసిన ఈ మూడు డోసుల వ్యాక్సిన్‌ ''ప్లగ్ అండ్ ప్లే'' సాంకేతికత ఆధారంగా తయారైనట్లు ప్రభుత్వానికి చెందిన బయోటెక్నాలజీ విభాగం(బీటీ) తెలిపింది.

కరోనా వైరస్‌లో వచ్చే కొత్త జన్యుమార్పులకు (మ్యుటేషన్లకు) అనుగుణంగా ఈ డీఎన్ఏ ప్లాస్మిడ్ కరోనా వ్యాక్సిన్ ప్రతిస్పందిస్తుంది. ఇప్పటికే ఉన్న వేరియంట్లతోపాటు భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను కూడా నిలువరించడంలో ఈ వ్యాక్సిన్ కీలకపాత్ర పోషిస్తుందని సంస్థ చెబుతోంది. జీకోవ్-డి (ZyCoV-D) పేరుతో విడుదల కానున్న ఈ వ్యాక్సిన్‌కు శుక్రవారం నాడు డీజీసీఐ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది.

అక్టోబ‌ర్ నుంచి ప్ర‌తి నెలా ఆ కంపెనీ కోటి డోసుల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ది. జైడ‌స్ కోవిడ్ టీకాల‌ను 12 ఏళ్ల చిన్నారుల‌కు కూడా ఇవ్వ‌నున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రి నాటికి.. మూడు నుంచి అయిదు కోట్ల కోవిడ్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు జైడ‌స్ కంపెనీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని పెంచేందుకు జైడిస్ కంపెనీ థార్డ్ పార్టీ కంపెనీల‌తో సంప్ర‌దింపుల్లో ఉన్న‌ది. టెక్నాల‌జీ ట్రాన్స్‌ఫ‌ర్‌కు కూడా జైడిస్ స‌ముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను పూర్తి దేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు తెలుస్తోంది.


Next Story