ఒడిశా-జార్ఖండ్ సరిహద్దులో పెద్ద మొత్తంలో డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. అలా మావోయిస్టుల కుట్రను భగ్నం చేశాయి. జార్ఖండ్‌లోని జరీకేలా పోలీస్ స్టేషన్‌లోని సారండా అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ ఆపరేషన్ జరిగింది. ఇక్కడ మావోయిస్టులు చురుగ్గా ఉన్నట్లు తెలిసింది. ఒడిశా-జార్ఖండ్ సరిహద్దులో 18,000 డిటోనేటర్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
నిఘా వర్గాల సమాచారం మేరకు, టోంటో పోలీస్ స్టేషన్‌లోని హుసిపి గ్రామంలో భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అడవులు, కొండలలో దాచిన సుమారు 18,000 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లను సురక్షితంగా నిర్వీర్యం చేయడానికి బాంబు స్క్వాడ్ బృందాన్ని పిలిపించారు.