బీజీపీకి షాక్‌ : కాంగ్రెస్ పార్టీలో చేరిన 18 మంది కీల‌క‌ నేతలు

18 Assam BJP leaders quit party, join Congress party in Guwahati. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి మునుపటి వైభవం లేకుండా పోయింది.

By Medi Samrat  Published on  23 Jan 2022 2:12 PM GMT
బీజీపీకి షాక్‌ : కాంగ్రెస్ పార్టీలో చేరిన 18 మంది కీల‌క‌ నేతలు

చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి మునుపటి వైభవం లేకుండా పోయింది. పలు ప్రాంతీయ పార్టీలలోకి షిఫ్ట్ అవుతున్న నాయకులు చాలా మంది. జాతీయ పార్టీ అయిన బీజేపీ చాలా రాష్ట్రాల్లో బాగా పుంజుకుంటూ ఉంది. అయితే బీజేపీకి ఏకంగా 18 మంది ప్రముఖ నాయకులు షాకిచ్చారు. అస్సాంలోని భారతీయ జనతా పార్టీకి చెందిన 18 మంది నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. గౌహతిలోని పార్టీ కార్యాలయంలో అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) భూపేన్ కుమార్ బోరా, ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత దేబబ్రత సైకియా సమక్షంలో బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్ విద్యార్థి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఇటీవల జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకున్నారని భూపేన్ కుమార్ బోరా చెప్పారు. ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ పని తీరు పట్ల యువతతో పాటు, రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని, నేడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరారని భూపేన్ కుమార్ బోరా అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని ఏపీసీసీ ఆదివారం ఘనంగా నిర్వహించింది. నేతాజీ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Next Story
Share it