గత 24 గంటల్లో బీహార్‌లోని 11 జిల్లాల్లో పిడుగుపాటుకు 17 మంది మృతి చెందినట్లు అధికారిక ప్రకటన శనివారం తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రోహ్తాస్ జిల్లాలో ఐదు మరణాలు నమోదయ్యాయి. ఔరంగాబాద్, బక్సర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. అర్వాల్, కిషన్‌గంజ్, కైమూర్, వైశాలి, సివాన్, పాట్నా, అరారియా, సరన్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వర్షాలు, పిడుగులు పడే సమయంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని కుమార్ విజ్ఞప్తి చేశారు. విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసే సూచనలను ప్రజలు పాటించాలని ఆయన కోరారు.