దేశంలో నమోదైన 14 కొత్త రకం కరోనా కేసులు!
14 more UK returnees test positive for new strain of Coronavirus. భారతదేశంలో గత కొద్ది నెలల నుంచి కరోనా మహమ్మారి
By Medi Samrat Published on 30 Dec 2020 6:03 PM IST
భారతదేశంలో గత కొద్ది నెలల నుంచి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న, రికవరీ రేటు అధికంగా ఉండి మరణాల సంఖ్య తక్కువగా ఉండటంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్తరకం కరోనా కేసులు దేశంలో వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్నటి వరకు కేవలం 6 కేసులను గుర్తించిన అధికారులు తాజాగా 14 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారికంగా వెల్లడించింది.దీంతో దేశం మొత్తం కొత్తరకం కరోనా కేసుల సంఖ్య 20 కు చేసుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది
ఈ కొత్తరకం వైరస్ బారిన పడిన బాధితులను గుర్తించి వారిని ప్రత్యేక ఐసోలేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు.అంతేకాకుండా బాధితులు ఎవరితో కాంటాక్ట్ అయ్యారో వారందరినీ గుర్తించి వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే కర్ణాటక, హైదరాబాద్ ,ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రాలలో కొత్తరకం వైరస్ వ్యాపించడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
దేశవ్యాప్తంగా కొత్తరకం వైరస్ ను గుర్తించటానికి 10 ప్రయోగశాలలో పనిచేస్తున్నాయి వీటిలో 7 ప్రయోగశాలలో ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా పది ప్రయోగశాలలో 107 నమూనాలను పరిశీలించగా వాటిలో 20 పాజిటివ్ కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 బ్రిటన్ నుంచి భారత్ కి దాదాపు 33 వేల మంది తిరిగి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.వీరందరినీ గుర్తించి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు తీసుకున్నాయి. లండన్ లో కొత్త రకం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అప్రమత్తమైన భారత ప్రభుత్వం అక్కడి నుంచి భారత్ కి వచ్చే విమానాల రాకపోకలను నిషేధించింది.అలాగే కొవిడ్‌పై ఏర్పాటైన ప్రత్యేక జాతీయ కార్యదళం డిసెంబరు 26న సమావేశం నిర్వహించి కొత్త రకం వైరస్ పై సమీక్ష నిర్వహించింది.