120 కేజీల డ్రగ్స్ పట్టివేత.. ఇప్పుడు కూడా అక్కడే..!

120 kg heroin seized in Gujarat. గుజరాత్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. దాదాపు 120 కిలోల డ్రగ్స్‌ను గుజరాత్

By Medi Samrat  Published on  15 Nov 2021 4:59 PM IST
120 కేజీల డ్రగ్స్ పట్టివేత.. ఇప్పుడు కూడా అక్కడే..!

గుజరాత్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. దాదాపు 120 కిలోల డ్రగ్స్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. దీని మార్కెట్ విలువ 6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. గుజరాత్ పోలీసులు మరో విజయం సాధించారని హర్ష్ సంఘ్వీ ట్విట్టర్‌లో పోస్ట్‌ను పంచుకున్నారు. గుజరాత్‌లో డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు గుజరాత్ పోలీసులు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సెప్టెంబర్‌లో కచ్‌లోని ముంద్రా పోర్ట్‌లో సుమారు రూ.21,000 కోట్ల విలువైన సుమారు 3,000 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. రెండు కార్గో కంటైనర్ల ద్వారా పెద్దఎత్తున డ్రగ్స్‌ను రవాణా చేశారు. ఇది షిప్పింగ్ సెమీ-ప్రాసెస్డ్ టాల్క్ స్టోన్‌గా ప్రకటించబడింది.

3000 కిలోల హెరాయిన్ స్వాధీనం :

కొద్దిరోజుల కింద చోటు చేసుకున్న ఈ ఘటన పెద్ద ఎత్తున సంచలనమైంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ డ్రగ్స్ పంపారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ను కాందహార్‌లోని హసన్ హుస్సేన్ లిమిటెడ్ ఎగుమతి చేసిందని, విజయవాడలోని ఆషి ట్రేడింగ్ కంపెనీ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు ద్వారా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు దిగుమతి చేస్తుందని కూడా చెప్పారు. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వద్ద ఉన్న ఈ కేసులో చెన్నై దంపతులను, కోయంబత్తూరుకు చెందిన మరో నిందితుడిని డీఆర్‌ఐ అరెస్టు చేసింది.


Next Story