శుభవార్త : పట్టాలెక్కనున్న మరో 12 రైళ్లు
12 Trains Start From April 1st. కరోనా మహమ్మారి కారణంగా రైళ్లన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేసుల సంఖ్య తగ్గుముఖం
By Medi Samrat Published on 13 March 2021 10:37 AM ISTకరోనా మహమ్మారి కారణంగా రైళ్లన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ అన్ని రైళ్లను పునరుద్దరిస్తూ వస్తోంది రైల్వే శాఖ. అయితే ఇప్పటికి కొన్ని రైళ్ల ఇంకా పట్టాలెక్కలేదు. దశల వారిగా రైళ్లను పొడిగిస్తూ వస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ క్రమ క్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరో 12 రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్దమవుతోంది. ఈ రైళ్లలో డైలీ మెయిల్ సర్వీసులు ఉండగా, మరికొన్ని వీక్లీ రైళ్లు ఉన్నాయి.
ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కే ఎక్స్‌ప్రెస్ రైళ్లు..రైళ్ల నెంబర్లు
విజయవాడ–సికింద్రాబాద్–విజయవాడ - 02799/02800
విజయవాడ–సాయినగర్ షిర్డి– విజయవాడ- 07207/07208
గూడూరు –విజయవాడ–గూడూరు- 02734/02644
విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం - 02739/02740
గుంటూరు –విశాఖపట్నం–గుంటూరు - 07239/07240
నర్సాపూర్–ధర్మవరం–నర్సాపూర్ - 07247/ 07248
ఈ రైళ్లను ఏప్రిల్ 1 నుంచి పునరుద్దరించనున్నారు. వీటితో ప్రత్యేక రైళ్లుగా దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. అయితే ప్రస్తుతం రైల్వే శాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రత్యేక రైళ్లుగా నడుపుతుండగా, ప్యాసింజర్ రైళ్లను మాత్రం ఇంకా పునరుద్దరించలేదు. రెగ్యులర్ రైళ్ల కోసం జనాలు ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం మున్ముందు మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.