ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నలను లేవనెత్తే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రా జిల్లాలోని టోల్ బూత్ బారికేడింగ్ దగ్గర దూసుకుపోతున్నాయి ట్రాక్టర్లు. ఆ ప్రాంతంలోని ఇసుక మాఫియాకు చెందిన 12 ఇసుక లోడ్ తో కూడిన ట్రాక్టర్లు దూసుకుపోతున్నట్లు ANI నివేదించింది.
సీసీటీవీలో చిత్రీకరించిన ఈ సంఘటన మొత్తం.. చెక్‌పాయింట్ మీదుగా ఒక ట్రాక్టర్ తర్వాత మరో ట్రాక్టర్ దూసుకుపోతున్నట్లు చూపిస్తుంది. 52 సెకన్లలోపు వీడియోలో వరుసగా ఎన్నో ట్రాక్టర్లు దానిని అనుసరించి టోల్ గేట్ గుండా వెళ్లిపోయాయి. ప్లాజా వద్ద ఉన్న ఉద్యోగులు కర్రలను ఉపయోగించి వారి అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నా కూడా ట్రాక్టర్లు దూసుకుపోయాయి. ఈ ఘటన అధికార యంత్రాంగంతో పాటు పోలీసులను కూడా ఉలిక్కిపడేలా చేసింది.
పోలీసులు కూడా ఈ ఘటన గురించి తెలుసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే శాండ్ మైనింగ్ మాఫియాకు సంబంధించి 51 ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగిస్తున్నందుకు కేసులు నమోదు చేయబడ్డాయి. ఈ ట్రాక్టర్లను నడిపిన వారిలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఉదయం ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. దాదాపు అన్నీ ధోల్‌పూర్‌కు చెందినవని తెలుస్తోందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.