బుల్లెట్ ట్రైన్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. మొద‌ట‌ ముంబై–అహ్మదాబాద్.. ఆ త‌ర్వాత‌‌ హైదరాబాద్-బెంగళూరు

12 more bullet train corridors proposed. ముంబై–అహ్మదాబాద్‌ హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టు(ఎంఏహెచ్‌ఎస్‌ఆర్‌)లో భాగంగా నడిపే

By Medi Samrat  Published on  20 Dec 2020 6:22 AM GMT
బుల్లెట్ ట్రైన్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. మొద‌ట‌ ముంబై–అహ్మదాబాద్.. ఆ త‌ర్వాత‌‌ హైదరాబాద్-బెంగళూరు

ముంబై–అహ్మదాబాద్‌ హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టు(ఎంఏహెచ్‌ఎస్‌ఆర్‌)లో భాగంగా నడిపే బుల్లెట్‌ రైలు చిత్రాన్ని జపాన్‌ రాయబార కార్యాలయం మొదటిసారిగా విడుదల చేసింది. ముంబై–అహ్మదాబాద్‌ మధ్య నడవనున్న ఈ-5 సిరీస్‌ షింకాన్‌సెన్‌ రైలింజన్‌కు కొన్ని మార్పులు చేయనున్నట్లు అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు 2023 కల్లా పూర్తి చేయాల్సి ఉంది. సుమారు రూ.1,08,000 కోట్ల ఈ ప్రాజెక్టుకు జపాన్‌ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సాయం అందిస్తుంది.

భారతీయ రైల్వే దేశ రాజధాని ఢిల్లీ నుంచి పలు నగరాలకు వెళ్లాలన్నా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్ల నెట్‌వర్క్ ను‌ అందుబాటులోకి రానున్నది. 2051 నాటికి దేశంలోని పలు నగరాలను బుల్లెట్‌ రైళ్లతో అనుసంధానించాలని రైల్వే శాఖ ప్రయత్నాలను మొదలుపెట్టింది. వివిధ మంత్రిత్వశాఖలతో సంప్రదింపుల తర్వాత 2021 జనవరిలో తన ముసాయిదా ఎన్‌ఆర్పీ తుదిరూపు దిద్దుకుంటుందని భారతీయ రైల్వే ఆశాభావంతో ఉంది. రైల్వేశాఖ ప్రతిపాదించిన ఎన్‌ఆర్పీ ప్రకారం నూతన బుల్లెట్‌ రైలు కారిడార్లను ప్రతిపాదించడంతో పాటు ప్రస్తుతం ప్రతిపాదించిన రూట్లను విస్తరించాలని లక్ష్యం పెట్టుకుంది.

హైదరాబాద్‌-బెంగళూరు బుల్లెట్‌ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముంబై-హైదరాబాద్‌ మార్గంలో విస్తరణ చేయనున్నారు. ఇది ముంబై-చెన్నై నగరాలను అనుసంధానించడంతోపాటు జమ్ము అమృత్‌సర్‌ వంటి ఉత్తర భారత నగరాలు భాగం అవుతాయి. హైదరాబాద్ - బెంగళూరు మధ్య 618 కిలోమీటర్ల దూరానికి కొత్తగా హై స్పీడ్ రైళ్లు వేయనున్నారు. దీనికోసం ప్రత్యేక లైన్ వేస్తారు. ఇది 2041 నాటికి పూర్తవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. ముంబై - హైదరాబాద్ మధ్య కూడా హైస్పీడ్ రైల్‌ను నడపనుంది. ఇది పూర్తీ కావడానికి 2051 పడుతుంది. ముంబై - చెన్నైలను కూడా కలపనుంది. మొదటి దశలో ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తవుతుంది. మూడో దశలో హైదరాబాద్ - బెంగళూరు ఉన్నాయి.


Next Story
Share it