హిమాలయాల్లో 11 మంది పర్వతారోహకులు మృతి

11 Trekkers Dead In Uttarakhand. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతశ్రేణులు అధిరోహించేందుకు వెళ్లిన 17 మంది పర్వతారోహకుల బృందంలో 11 మృతి

By అంజి
Published on : 23 Oct 2021 8:58 AM IST

హిమాలయాల్లో 11 మంది పర్వతారోహకులు మృతి

ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతశ్రేణులు అధిరోహించేందుకు వెళ్లిన 17 మంది పర్వతారోహకుల బృందంలో 11 మృతి చెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం లాంఖగాపాస్‌లో 17 వేల అడుగుల ఎత్తులో భారత వాయుసేన గాలింపు చేపట్టింది. ఇక్కడ అక్టోబర్‌ 18న భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణం కారంణంగా పర్యాటకులు, పోర్టర్‌లు, గైడ్‌లతో కూడిన 17 మంది గల బృందం దారి తప్పిపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ నుండి అక్టోబర్‌ 14వ తేదీన ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌ పర్వతారోహకుల బృందం బయల్దేరింది.

వాతావరణం అనుకూలించక ఈ నెల 18వ తేదీన దారితప్పిపోయారు. అక్టోబర్‌ 20న అధికారులు చేసిన ఎస్‌ఓఎస్‌ కాల్‌కు భారత వాయుసేన స్పందించింది. 11 Trekkers Dead In Uttarakhandహర్సిల్‌కు రెండు అడ్వాన్స్‌డ్ లైట్‌ హెలికాప్టర్‌లను పంపింది. అదే రోజు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌కి చెందిన ముగ్గరు సిబ్బందితో హెలికాప్టర్‌లలో రెస్య్కూ ప్రారంభించారు. లాంఖంగా పాస్‌పై 17 వేల అడుగుల ఎత్తులో 11 మంది మృతదేహాలను గుర్తించారు. హిమాలయాల్లో చిక్కుకున్న వారి మృతి దేహాలను తీసుకువచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story