ఉత్తరప్రదేశ్‌లో ఓ కుక్క స్వైర విహారం చేసింది. స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులపై కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. షామ్లీ జిల్లాలో పాఠశాలకు వెళుతున్న పది మంది పాఠశాల విద్యార్థులను రేబిస్ సోకిన కుక్క కాటు వేసినట్లు శనివారం తెలిసింది. ఈ సంఘటన శుక్రవారం కైరానా పోలీస్ స్టేషన్ పరిధిలోని జహన్‌పూర్ గ్రామంలో జరిగింది. వైరల్ వ్యాధితో ఉన్న కుక్క పిల్లలను కరిచింది. గాయాల పాలైన వారికి స్థానికంగా ప్రాథమిక చికిత్స చేశారు.
అందులో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి పంపవలసి వచ్చిందని గ్రామ పెద్ద ముబారక్ అలీ తెలిపారు. సాదిక్ (4), మహక్ (4), ఇన్షా (10), శ్యామ్ (7)లను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం నలుగురు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థులపై దాడి చేసిన కుక్కను గ్రామస్తులు ఆగ్రహంతో చంపేశారు. కొన్ని వీధి కుక్కలకు వివిధ అంటూ వ్యాధులు సోకి వింతగా ప్రవర్తిస్తున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు.