ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఆయా నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. కేంద్రం అలర్ట్‌తో ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని పలు నగరాల్లో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై ఆరా తీశారు. ఐబీ చీఫ్, ఢిల్లీ సీపీతో ఫోన్ లో మాట్లాడిన ఆయన పేలుడు సంభవించడానికి గల ప్రాథమిక కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఐఏ, NSG, ఢిల్లీ పోలీస్ స్పేషల్ సెల్ దర్యాప్తు చేపట్టాయి. ఈ క్రమంలో పేలుడు సంభవించిన ప్రదేశానికి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.