మోదీ.. మరో అరుదైన రికార్డును సొంతం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 7:22 PM IST
మోదీ.. మరో అరుదైన రికార్డును సొంతం

భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డును అందుకున్నారు. అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా సేవలందించిన నాలుగో ప్రధాన మంత్రిగా ఆయన రికార్డులోకెక్కారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని మంత్రులు కాకుండా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ ఆ స్థానంలో ఉన్నారు. వాజ్‌పాయ్ 2268 రోజులు భారతదేశాన్ని ప్రధాని మంత్రిగా పాలించగా.. ఆ పదవీ కాలాన్ని మోదీ దాటిపోయారు.

భారత్ కు అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ వున్నారు. కాంగ్రేసేతర ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన ఘనత తాజాగా మోదీ సొంతం చేసుకున్నారు. అంతకు ముందు దివంగత వాజ్ పేయ్ కాంగ్రేసేతర ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా ఉన్నారు.

మోదీ మే 26, 2014 న భారతదేశానికి 14 వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి ప్రధానిగా మే 30, 2019 న ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయన ఖాతాలో మరో రికార్డు కూడా చేరనుంది. ఆగస్టు 15 నాడు ప్రధాని హోదాలో ఎర్ర కోట నుంచి జాతీయ జెండా అత్యధిక సార్లు ఎగుర వేసిన ప్రధానుల జాబితాలో మోదీ నాలుగో స్థానంలో ఉన్నారు.

Next Story