నాని 'వి' ట్రైలర్..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2020 12:10 PM IST
నాని వి ట్రైలర్..

నేచురల్ స్టార్ నాని కెరియర్ లో 25వ సినిమాగా వస్తున్న చిత్రం 'వి'. సుదీర్‌బాబుతో కలిసి ఆయన కీలక పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్‌ మూవీలో అదితి రావ్ హైదరి, నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆఫీసియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

నాని ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 'హలో హలో హలో.. మైక్ టెస్టింగ్ 1 2 3.. 123..' అంటూ నాని చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. ''జనరల్ గా ఇలాంటి సైకోలు పాపులారిటీ కోసమే ఇలాంటి పనులు చేస్తుంటారు'' అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ తో నాని సైకో పాత్రలో కనిపిస్తున్నాడని అర్థం అవుతోంది. 'ఏ పని చేసినా సరే ఎంటర్టైనింగ్ గా చేయాలనేదే నా పాలసీ..' 'ఇది సైడ్ బిజినెస్.. మెయిన్ బిజినెస్ వేరే ఉంది' అని నాని చెప్తుండటంతో ఈ సినిమాలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. జగపతిబాబు, వెన్నెల కిశోర్, నాజర్, అవసరాల శ్రీనివాస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story