మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజు సరసన నభా నటేష్‌ నటిస్తోంది. అంత స్ట్రికట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్‌కి అమృతని చూశాక ఏమైంది..? అంటూ నిన్న సాయిధరమ్‌ తేజ్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేయగా.. నేడు చిత్రంలోని పాటను విడుదల చేశారు.

‘ హేయ్‌ ఇది నేనేనా.. హేయ్‌ ఇది నేజమేనా’ అంటూ సాగే ఈ పాటలో సోలోగా ఉండాలనుకున్న హీరో.. హీరోయిన్‌ పరిచయమయ్యాక తన ప్రేమలో పడి విహరిస్తున్నట్లు కన్పిస్తోంది. తమన్ సంగీతం సంగీత సారథ్యంలో ‘హే ఇది నేనేనా’ అనే మెలోడీ ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇక ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘నో పెళ్లి’ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలో రానా, వరుణ్ తేజ్ కూడా సందడి చేయడం విశేషం.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకోగానే త్వరలోనే విడుదల కానుంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort