ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి.. నా దగ్గర.. దాచానంతే.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sept 2020 6:54 PM IST
ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి.. నా దగ్గర.. దాచానంతే.!

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు యూత్‌లో ఎంత‌‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్.. ఆయ‌న‌కు సోష‌ల్‌మీడియాలో ఎన్నో రికార్డులు క‌ట్ట‌బెట్టారు. అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత ఏ మూవీ చేయ‌ని ప‌వ‌న్‌.. వ‌కీల్ సాబ్‌తో వ‌స్తున్నాడు. చాలా రోజులుగా ప‌వ‌న్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న అభిమానుల‌కు ఈ సినిమా ఓ పండ‌గే.

అయితే.. అంత‌కంటే ముందే మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు.. ప‌వ‌న్‌ ఫ్యాన్స్ పండ‌గ చేసుకునే ఓ‌ రేర్‌ ఫొటో ఒకటి ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో పవన్‌ కల్యాణ్‌ యువకుడిగా, నూనూగు మీసాలతో కనిపిస్తున్నారు. అభిమానులు ల‌వ‌ర్ బాయ్‌, ప‌వ‌ర్ స్టార్‌, ప‌వ‌ర్‌పుల్ ఐస్‌(క‌ళ్లు) అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక ఈ ఫొటో షేర్ చేస్తూ మెగా బ్రదర్‌.. ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి.. నా దగ్గర.. దాచానంతే.. ఫరెవర్‌ బెస్ట్ బ్రదర్‌.. ఫరెవర్‌ లవ్‌.. పవన్‌ కల్యాణ్ అంటూ త‌మ్ముడి ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నాడు. దీంతో మెగాభిమానులు నాగబాబుకి రిక్వెస్ట్‌లు స్టార్ట్ చేశారు. దయచేసి మీద‌గ్గ‌రున్న మిగ‌తా ఫోటోల‌ను కూడా ఒక్కొక్కటిగా పోస్ట్ చేయండి సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story