అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పేరు మారుమోగుతోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన తెలంగాణకు వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయనకు బీజేపీ శ్రేణులు శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా ఎత్తున ఘన స్వాగతం పలికారు. కాగా, బండి సంజయ్‌కి కేంద్ర ప్రభుత్వం మరో పదవిని కట్టబెట్టింది.

దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఒకటిగా పేరొందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కు దేశ వ్యాప్తంగా ఉన్న 8 కళాశాలలకు కేంద్రం బోర్డు సభ్యులను నియమించింది. ఇందులో తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ బోర్డు సభ్యునిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ని నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఆయనకు ఈ పదవి ఇవ్వడం బీజేపీ నేతలు, ఆయన అనుచరులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, బండి సంజయ్‌ ఢిల్లీ నుంచి ఆదివారం నగరానికి వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చి నిర్వహించిన సభలు పాల్గొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.