వృద్ధురాలి అంత్యక్రియల్లో వానరాలు.. ఫోటోలు వైరల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Oct 2020 6:30 PM ISTకరోనా కాలంలో ఎవరైనా చనిపోతే.. వారి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులే వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా బెల్హాలో ఓ వృద్ధురాలు చనిపోతే ఆమె అంత్యక్రియలకు కోతులు వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కొన్ని వానరాలు అయితే.. దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాయి.
ప్రతాప్‌గడ్ నగరంలో ఓ వృద్దురాలు మృతి చెందింది. అక్కడకు చేరిన వానరాలు మృతదేహాం చుట్టూ కూర్చున్నాయి. అందులోని కొండముచ్చు అయితే.. ఏకంగా మంచంపై కూర్చుని కొంత సమయం అక్కడే ఉంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఈ వింతను చేసి వెళ్లారు.
ఈ ఘటన గురించే ఊరంతా చర్చించుకున్నారు. తమ గ్రామంలో గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి వింత ఘటనలు జరగలేదన్నారు. వృద్దురాలి మృతదేహం వద్ద అవి సుమారు రెండు గంటలపాటు కూర్చొని వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదంతా దేవుడి లీలగా వారు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.