కరోనా: కేంద్రం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

By సుభాష్  Published on  18 Jun 2020 7:46 PM IST
కరోనా: కేంద్రం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో దానిని కట్టడి చేసేందుకు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న వైద్యులు,ఆరోగ్య సిబ్బందికి వేతనాలు సకాలంలో చెల్లించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిన ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌ లేఖ రాశారు. వైద్య సిబ్బంది ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారని, కరోనా వైరస్‌కు ఏ మాత్రం భయపడకుండా విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. ఇలాంటి సమయంలో వారి వేతనాల్లో ఎలాంటి ఆలస్యం రాకూడదని సూచించింది. ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి జీతాలు సమయానికి చెల్లించాలని, లేకపోతే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖలో ఆదేశించారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సయయంలో వైద్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని ప్రధాని సైతం ప్రశంసించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. వారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలుపడం, హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించడం లాంటివి చేసిన విషయం తెలిసిందే.

Next Story