తమిళనాడులో ఆ నాలుగు జిల్లాల్లో మద్యం కోసం పరుగులు.. ఎందుకో తెలిస్తే..

By సుభాష్  Published on  18 Jun 2020 11:19 AM GMT
తమిళనాడులో ఆ నాలుగు జిల్లాల్లో మద్యం కోసం పరుగులు.. ఎందుకో తెలిస్తే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. దేశ ప్రజలను పట్టిపీడిస్తోంది. చాపకింద నీరులా వెంటాడుతోంది. కరోనాకు సరైన వ్యాక్సిన్ లేక దేశాలతో ఆటలాడుకుంటోంది. ఇక అసలు విషయానికొస్తే గత రెండు నెలలుగా ఉన్న లాక్‌డౌన్‌ సమయంలో మద్యం షాపులు పూర్తిగా మూత పడటంతో మద్యం ప్రియులు పడరాని కష్టాలు పడ్డారు. మద్యం సుక్కలేకపోవడంతో పచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ నిద్రలేని రాత్రులు గడిపారు. అయితే దేశంలో లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా తిరిగి మద్యం షాపులు తెరుచుకోవడంతో మద్యం బాబులు ఆనందం వ్యక్తం చేస్తూ పండగ చేసుకున్నారు. ఇక తమిళనాడులో అయితే మద్యం షాపుల ముందు క్యూలు కట్టారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని మరీ మద్యం కొనుగోలు చేశారు.

తాజాగా భారత్‌ లో కరోనా కోరలు చాస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకూ సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని చెన్నైతోపాటు చంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో 11 రోజుల పాటు లాక్‌డౌన్‌ సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఇక శుక్రవారం నుంచి ఆ నాలుగు జిల్లాల్లో మద్యం షాపులు మూతపడటంతో మద్యం ప్రియులు ముందస్తుగా మద్యం కొనుగోలు చేసేందుకు ప్రతి రోజు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. మద్యం బాటిళ్లను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసుకుని స్టాక్‌ పెట్టుకుంటున్నారు. నాలుగు జిల్లాల్లో ఏ మద్యం షాపు వద్ద చూసినా.. వందలాదిగా మద్యం ప్రియులు క్యూలు కట్టారు.

Next Story