మోదీ హత్యకు కుట్రపై 19 మందిపై చార్జీషీట్‌

By సుభాష్  Published on  20 Dec 2019 6:09 AM GMT
మోదీ హత్యకు కుట్రపై 19 మందిపై చార్జీషీట్‌

దేశ ప్రధాని నరేంద్రమోదీని హత్య చేసేందుకు కుట్రపన్నారని భీమా కోరేగావ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 మందిపై ప్రాసిక్యూటర్‌ అభియోగాలను మహారాష్ట్ర పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. దీంతో మావోయిస్టు సానుభూతిపరులైన హక్కుల నేతలకు ప్రమేయం ఉందని పుణేలోని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో ఈ చార్జీషీటును దాఖలు చేశారు. ఈ నేతల్లో రచయిత వరవరరావు,సుదీర్‌, ధవాళే, రోనా విల్సన్‌, సురేంద్ర, మహేష్‌ రౌతు,అరుణ్‌పెరీరా, వెర్మన్‌ గోంసాల్వెస్‌, షోమా సేన్‌, సుధా భరద్వాజ ఉన్నారు. కాగా, 2017 డిసెంబరు 31న భీమా కోరెగాం ప్రాంతంలో ఎల్గార్‌ పరిషత్‌ సమావేశం జరిగింది. ఇది మావోయిస్టులు ఏర్పాటు చేసినదేనని పోలీసులు ఆరోపణలు గుప్పించారు. అనంతరం బీమా కోరెగాం సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు సాగడం, అనంతరం హింస, రాజకీయంగా దుమారం రేపాయి. వీటికి హక్కుల నేతలే కారణమని ఆరోపిస్తూ ఈ తొమ్మిది మందినీ నిర్బంధించారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇపుడు చార్జిషీటు దాఖలు చేశారు. రాజీవ్‌గాంధీని శ్రీపెరంబదూర్‌లో హత్య చేసిన తరహాలోనే మోదీని కూడా హత్య చేసేందుకు కుట్రపన్నారని ముసాయిదా ఆరోపించారు.

మోదీ హత్య కోసం భారీ కుట్ర

కాగా, ప్రధాని మోదీని హత్య చేసేందుకు భారీ కుట్ర పన్నినట్లు, ఇందు కోసం రూ 8 కోట్ల నగదు, ఓ అత్యాధునికమైన ఎం-4 రైఫిల్‌, 4 లక్షల రౌండ్ల మందుగుండు, మరికొన్ని మారణాయుధాలను ఓ సప్లయర్‌ నుంచి నేపాల్‌, మణిపూర్‌ మీదుగా తీసుకురావాలని ప్రయత్నించారని చార్జిషీటు ముసాయిదా ఆరోపించారు. కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధానికి, కూల్చివేతకు భారీ కుట్ర జరిగిందని ఆరోపించారు.

Next Story