రాజమండ్రిలో దారుణం.. మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 7:01 PM IST
రాజమండ్రిలో దారుణం.. మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. మైనర్‌ బాలికపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల అనంతరం పోలీస్‌ సేష్టన్‌ బయట వదిలివెళ్లారు. వివరాల్లోకి వెళితే.. మధురపూడికి చెందిన 16 సంవత్సరాల బాలికకు మాయ మాటలు చెప్పిన ఏడుగురు యువకులు.. ఆమెను క్వారీ సెంటర్ లోని ఇంట్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నాలుగు రోజులపాటు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ బాలిక చెప్పింది. అంతేకాకుండా తనను చిత్ర హింసలకు గురి చేశారని తెలిపింది. బాలికను తీసుకెళ్లిన ఆ ఇంటిలోని మహిళ కూడా యువకులకు వత్తాసు పలికిందని, తనను చిత్రహింసలకు గురి చేసిందని చెప్పారు.

నాలుగు రోజుల అనంతరం ఇవాళ ఉదయం నిందితులు బాధితురాలిని పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్లారు. అయితే బాలిక కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు ఐదు రోజుల కిందట కోరుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్‌ స్టేషన్‌లో కూడా తనపై అనుచితంగా ప్రవర్తించారని బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుకొంటోంది. కోరుకొండ పోలీసులు కేసును పక్క దోవ పట్టిస్తున్నారు అని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story