ఆ ఐదుగురుని చూస్తే.. హాలీవుడ్ మూవీలో మాదిరే కనిపిస్తారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 July 2020 6:40 AM GMT
ఆ ఐదుగురుని చూస్తే.. హాలీవుడ్ మూవీలో మాదిరే కనిపిస్తారు

టాలీవుడ్ సినిమాల్ని కాసేపు వదిలేయండి. బాలీవుడ్ సినిమాల్లోనూ ఏదైనా మల్టీస్టారర్ సినిమాల్ని చూస్తే.. అందులోని పాత్రల కంటే.. వాటిని పోషించే నటులే ఎక్కువగా కనిపిస్తారు. కండలు తిరిగి.. ఫిట్ గా ఉంటారు. అందుకే రీల్ హీరోలకు.. రియల్ హీరోలకు ఏ మాత్రం పొంతన ఉండదు. వాస్తవానికి దగ్గరగా తీసే కొన్నిహిందీ సినిమాలు ఇందుకు భిన్నం. వీటి కోవలోకే వస్తాయి హాలీవుడ్ సినిమాలు. వారి సినిమాల్లో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. నటులు పెద్దగా కనిపించరు. అంతలా ఒదిగిపోతారు. యావత్ దేశం మొత్తం ఇప్పుడు రాఫెల్ గురించి మాట్లాడుకుంటోంది.

ఈ అత్యాధునిక యుద్ధ విమానాల్ని నడిపే పైలెట్లు ఎలా ఉంటారు? అన్న విషయానికి వెళితే.. ఎవరికి వారు హీమ్యాన్ లా అంచనా వేసుకుంటారు. కనీసం.. మంచి హైటు.. వెయిట్.. ఫిట్ గా ఉంటారేమో భావిస్తారు. అందుకే అంటారు కల్పన వేరు.. వాస్తవం వేరని. తాజాగా ఫ్రాన్స్ నుంచి భారత్ కు తీసుకొచ్చిన ఐదు రఫెల్ విమానాల పైలెట్లకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దీన్ని నిశితంగా చూస్తే.. ఇద్దరు తప్పించి.. మిగిలిన ముగ్గురు రెఫెల్ విమానాన్ని నడుపుతారని ఊహించలేం కూడా. వారికి సాదాసీదా బట్టలు వేసి.. మాట్లాడితే.. నమ్మరంటే నమ్మరు.

కానీ.. వాస్తవాలు ఇలానే ఉంటాయి. అందుకే.. రఫెల్ యుద్ధ విమానాల్ని తీసుకొచ్చిన ఐదుగురు పైలెట్లను చూస్తే.. హాలీవుడ్ మూవీ కాంబినేషన్ మాదిరి కనిపించక మానదు. నెలకు పైనే ప్రత్యేక శిక్షణ తీసుకొని ఏడువేల కిలోమీటర్లు ప్రయాణించి.. అంబాలా వాయుసేన బేస్ కు చేరుకున్నారు. ఈ ఐదుగురి బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. గ్రూపునకు కెప్టెన్ గా వ్యవహరించారు ‘‘హర్ కిరత్ సింగ్’’. అత్యుత్తమ శౌర్యచక్ర పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఆయన కమిట్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. పన్నెండేళ్ల క్రితం ఒక మిషన్ లో ఆయన నడుపుతున్న ఏయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలోనూ ఆయన చాలామంది ప్రాణాల్ని కాపాడటం గమనార్హం. ఆయన తండ్రి వాయుసేనలో లెఫ్టినెంట్ కల్నల్ గా సేవలందించారు.

R1

మరొకరు ‘‘అభిషేక్ త్రిపాఠి’’. రాజస్థాన్ కు చెందిన ఆయన వాయుసేలో వింగ్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. చదువుకునే సమయంలో రెజ్లర్. ఇతడి తండ్రి బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి ఐటీ విభాగంలో సేవలు అందించారు. మంచి స్పోర్ట్స్ మ్యాన్‌ గా పేరుంది. మూడో వ్యక్తి ‘‘మనీశ్ సింగ్’’. యూపీలోని చిన్న గ్రామం నుంచి వింగ్ కమాండ్ స్థాయికి చేరుకున్నారు. వీరి కుటుంబంలో చాలామంది ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పని చేశారు. సైనిక్ స్కూల్లో చదివిన మనీశ్ 2003లో ఎయిర్ ఫోర్సులో జాయిన్ అయ్యారు.

ఇక నాలుగో వ్యక్తి ‘‘రోహిత్ కఠారియా’’. హర్యానాకు చెందిన ఇతడి బ్యాక్ గ్రౌండ్ మంచి స్ఫూర్తిని కలిగిస్తుంది. ఆయన తండ్రి ఆర్మీ అధికారి. కల్నల్ గా పదవీ విరమణ పొంది.. సైనిక్ స్కూల్ కు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. రోహిత్ తండ్రిని వారి సొంతూరులో చాలామంది రోల్ మోడల్ గా వ్యవహరిస్తారు. ఐదో వ్యక్తికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు.

Next Story
Share it