మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ..?

By సుభాష్  Published on  4 Sept 2020 9:32 AM IST
మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ..?

మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు ఆచూకీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన ఆరోగ్యం

క్షీణించిందని, త్వరలో పోలీసుల ముందు లొంగిపోతాడన్న వార్తులు ఏపీ, తెలంగాణతోపాటు జాతీయ మీడియాలో జోరుగా

కథనాలు వెలువడుతున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు

జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. గణపతి లొంగుబాటుపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరులు,

కుటుంబ సభ్యుల ద్వారా లొంగిపోయేందుకు సిద్దమవుతున్నట్లు కూడా వార్తులు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే గణపతి నిజంగానే లొంగిపోయేందుకు సిద్దమవుతున్నారన్న వార్తలు నిజమేనా..? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఒక వైపు మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ఖండిస్తోంది.

కాగా, గణపతి నేతృత్వంలోనే దేశంలో మావోయిస్టు పార్టీ బాగా విస్తరించిందనే అభిప్రాయం కూడా ఉంది. దేశ విదేశాల నుంచి

నిధులను సమీకరించడంలో, పార్టీ కేడర్‌ను టెక్నాలజీ పరంగా ఆయుధాలు సమకూర్చడంలో, ప్రజల ఆలోచనలకు

అనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోవడంఓ ఆయన వ్యూహాలు చాలా ముందుచూపుతో ఉంటాయి. అయితే 13 రాష్ట్రాల్లో

మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం జాతీయ

దర్యాప్తు సంస్థ, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

13 రాష్ట్రాల్లో గణపతిపై ఉన్న కేసులు ఎత్తివేస్తారా..?

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. గణపతి లొంగిపోవాడనికి అంగీకరించాడనుకున్నా.. ఒక్క తెలంగాణ పోలీసులు పాత

కేసులన్నీ మాఫీ చేసినా.. మిగిలిన 12 రాష్ట్రాల పోలీసులు కేసులు ఎత్తివేతకు సుముఖంగా ఉంటారా..? అన్నది

తలెత్తుతున్న ప్రశ్న. ఎన్‌ఐఏ,రా వంటి సంస్థలు విచారించకుండా ఉంటాయా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ

కేసులన్నీ ఎత్తివేయాలంటే కేంద్ర హోంమంత్రిత్వశాఖ అంగీకారం తెలుపాల్సి ఉంటుంది. అదే విధంగా 43 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టిన గణపతిపై కేసులు ఎత్తివేస్తారా..? అనేది అనుమానం కలిగించే విషయమే.

గణపతి లొంగుబాటుపై స్పందించిన కేంద్ర మావోయిస్టు కమిటీ

కాగా, గణపతి లొంగుబాటుపై వస్తున్న వార్తల నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. లొంగుబాటుపై ఖండించింది. గణపతి లొంగుబాటు అనేది పోలీసులు కల్పిత కథ అని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో విడుదలైన రెండు పేజీల లేఖలో స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమన్నారు. తెలంగాణ, ఛత్తీగఢ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు కట్టు కథలు అల్లుతున్నారని ఆరోపించారు. కామ్రేడ్‌ గణపతి అనారోగ్య కారణాల వల్ల స్వచ్చంధంగా బాధ్యతల నుంచి తప్పుకొన్నారని, అయినా ప్రజా సమస్యలపై నిరంతరం ఆయన పోరాడుతూనే ఉంటారన్నారు. అలాగే గణపతితో పాటు మరి కొంత మంది మావోయిస్టులు లొంగుబాటుపై వస్తున్న వార్తలపై కూడా అభయ్‌ ఖండించారు. సిద్ధాంతపరంగా, రాజకీయంగా తమ నాయకత్వం దృఢంగా ఉందని స్పష్టం చేశారు.

Next Story