దేశాన్ని కాపాడటంలో తమ ప్రాణాల్ని సైతం పణ్ణంగా పెట్టే జవాన్లు..మానవత్వాన్ని చూపింటంలో కూడా మాకు మేమే సాటి అనిపిస్తున్నారు. దేశ ప్రజల ప్రాణాలను తమ భుజస్కంధాలపై మోసే మన జవాన్లు ఓ మృతదేహాన్ని కూడా మోసి మానవత్వానికి మారుపేరుగా నిలిచారు. దేశాన్ని కాపాడటంలో తమ ప్రాణాలను సైతం పణ్ణంగా పెట్టే జవాన్లు.. మానత్వం చాటి ప్రశంసలు పొందుతున్నారు. దేశ ప్రజల ప్రాణాలను తమ భుజాలపై మోసే మన జవాన్లు ఓ మృతదేహాన్ని కూడా మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. డెహ్రాడూన్ ఇండో టిబెటన్‌ సరిహద్దు.. ఉత్తరాఖండ్‌లోని పిథోరగర్హ్‌ జిల్లాలో ఆగస్టు 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పిథోరగర్హ్‌ జిల్లాలోని మున్సియారి గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు సుయుని గ్రామంలో మృతి చెందాడు. రాళ్లను పగులగొడుతుండగా ప్రమాదవశాత్తు అవి యువకుడికి తగలడంతో మరణించాడు. అయితే యువకుడు మృతి చెందిన విషయం ఆగస్టు 30న ఐటీబీపీ జవాన్లకు తెలిసింది. వారు సుయుని నుంచి మున్సియారి గ్రామానికి 25 కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో 8 మంది జవాన్లు 30వ తేదీన మృతదేహాన్ని స్ట్రెచర్‌లో పెట్టి వారి భుజాలపైకి ఎత్తుకుని మోసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి నడక 8 గంటల పాటు కొనసాగింది. దీంతో కుటుంబ సభ్యులు జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి సమయంలో మానవత్వం చాటిన జవాన్లను ప్రశంసిస్తున్నారు. సొంతవాళ్లను సరిగ్గా పట్టించుకోని ఈ రోజుల్లో గుర్తు తెలియని శవాన్ని సైతం కుటుంబ సభ్యులకు అప్పగించం వారి మానవత్వానికి నిదర్శనమన్నారు.

మరణించిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు.. అతనితో వారికి ఎటువంటి సంబంధాలూ కూడా లేవు. కానీ అతని మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించాడనికి 8 గంటల పాటు 25 కిలోమీటర్ల మేర నడిచి మానవత్వానికి మారుపేరుగా నిలిచారు ఆ జవాన్లు.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *