56 సంవత్సరాల పెద్ద మనిషికి అదేం పాడుబుద్ధో.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 May 2020 4:34 PM IST
56 సంవత్సరాల పెద్ద మనిషికి అదేం పాడుబుద్ధో.!

56 సంవత్సరాల పెద్ద మనిషి.. నలుగురికి మంచి మాటలు చెప్పాల్సిన వయసు. కానీ వాటిని ఏమీ పట్టించుకోకుండా ఎంతో నీచానికి దిగజారాడు. అయిదు సంవత్సరాల బాలికను అత్యాచారం చేశాడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుళ్ళు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసును రిజిస్టర్ చేశామని కుళ్ళు ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. తాను బయటకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి తన ఇంట్లోకి వచ్చాడని.. తమ కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇండియన్ పీనల్ కోడ్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెక్షన్ యాక్ట్ కింద కుళ్ళు పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు.

56 సంవత్సరాల వ్యక్తి దారి తప్పిన యువతకు దిశానిర్దేశం చేయాల్సిన వయసు. కానీ అవేవీ పట్టించుకోకుండా మనవరాలు వయసున్న బాలికపై తన కామవాంఛలు తీర్చుకోవాలని చూశాడు. సభ్య సమాజం తలదించుకునే పని చేసిన అతనిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story