ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మూఢనమ్మకాలను నమ్మే వారున్నారంటే ఆశ్చర్యపోక మానదు. కొన్ని కొన్ని మూఢనమ్మకాలను వింటుంటే విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి దాని గురించే మీకు చెప్పబోయేది. తాజాగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ సెంట్రల్‌ జైలులో ఓ ఖైదీ చేసిన పనికి జైలు అధికారులు నివ్వెరపోయారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

తన గదిలోని స్పూన్‌ను ఓ రాయికి బాగా రాసి.. దానితో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. అంతే కాదండోయ్‌..కోసిన పురుషాంగాన్ని జైలు పరిసరాల్లో ఉన్న శివ లింగానికి సమర్పించాడట. విష్ణుసింగ్‌ అనే ఖైదీ ఈ ఘటనకు పాల్పడటంతో తీవ్ర రక్తస్రావం రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా, గమనించిన జైలు సూపరింటెండెంట్‌ మనోజ్‌ సాహు అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇలాంటి పని ఎందుకు చేశావని జైలు అధికారులు అడిగితే దేవుని కోసం చేశానని చెప్పినట్లు సమాచారం.

కాగా, ఓ హత్య కేసులో జైల్లో శిక్షణను అనుభవిస్తున్న విష్ణుసింగ్‌ మధ్యప్రదేశ్‌లోని బిండ్‌ జిల్లాకు చెందిన వ్యక్తి అని జైలు అధికారులు మీడియాకు వివరించారు.
అయితే పురుషాంగాన్ని విష్ణుసింగే కోసుకున్నాడా…? లేక తోటి ఖైదీలు ఇలా చేశారా..? అనే దానిపై జైలు అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా, దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా జైలులో కూడా తోటి ఖైదీలు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేలా జైలు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *