ఒక వైపు దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుంటే మరోవైపు మానవృగాళ్లు దారుణాలకు ఒడిగడుతున్నారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న భార్యపైనే భర్త తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. హర్యాలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి భార్యతో కలిసి కర్నాల్‌ ప్రాంతంలో నివసిస్తున్నాడు. మద్యం తాగుడు, పేకాటకు అలవాటు పడిన భర్త.. ప్రతినిత్యం భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో తన స్నేహితుల కామ వాంఛ తీర్చాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో నలుగురు స్నేహితులతో కలిసి ఆమె కాళ్లు, చేతులను కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ కామాంధులు.

మద్యం మత్తలు లైంగిక ఆనందాన్ని పొందారు. అయితే నిందితుల్లో ఒకడు గతంలో బాలికపై అత్యాచారానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఈ విషయం మొదట్లో ఆమె ఎవరితో చెప్పకపోవడంతో ఆమె స్నేహితులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *