ఆ కుటుంబం అంత ఆనందంగా డ్యాన్స్ చేయడానికి కారణం ఏమిటో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 4:09 PM GMT
ఆ కుటుంబం అంత ఆనందంగా డ్యాన్స్ చేయడానికి కారణం ఏమిటో తెలుసా..?

కట్ని, మధ్యప్రదేశ్ : ఆసుపత్రి వార్డులో ఓ కుటుంబం చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకూ ఆ కుటుంబం అంత ఆనందంగా డ్యాన్స్ చేయడానికి కారణం ఏమిటో తెలుసా..? వారికి కరోనా నెగటివ్ రావడమే..! ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్న సందర్భంగా వారందరూ అలా ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేశారు.

ఆ కుటుంబంలోని చిన్న పిల్లలు కూడా ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చిచోరే సినిమా లోని 'చింతా కర్కే క్యా పాయేగా.. మర్నే సే పెహ్లే మర్ జాయేగా' అనే పాటకు డ్యాన్స్ చేశారు.

19 మంది కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం కట్ని లోని ఐసోలేషన్ వార్డులో ఆగష్టు 8న జాయిన్ అయ్యారని కట్ని జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ యశ్వంత్ వర్మ తెలిపారు. ఆ తర్వాత వారికి టెస్టులు చేయగా నెగటివ్ అని రావడంతో ఆగష్టు 15న వారిని డిశ్చార్జ్ చేశామని అన్నారు.

వారు ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఐసోలేషన్ లో ఉన్న బాధ పోవడానికి మానసికంగా వారు బాగుండడానికి డాక్టర్లు కూడా పాటలు పెట్టడానికి అనుమతి ఇస్తున్నారు. పలు ఐసోలేషన్ సెంటర్లలో కూడా ఇలా డ్యాన్స్ లు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి.

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకీ ఎక్కువవుతూ ఉన్నాయి. గత 13 రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు వస్తున్న దేశం భారత్ మాత్రమే. దేశంలో రికవరీ రేటు 73 శాతం ఉంది.

భారత్‌లో 24 గంటల్లో 55,079 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 876 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,02,743కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 51,797 కి పెరిగింది. ఇక 6,73,166 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 19,77,780 మంది కోలుకున్నారు.

Next Story
Share it