మాధవీ లత పోస్టు ఆ రెండు పెళ్లీల్లను ఉద్దేశించేనా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 May 2020 8:48 AM GMT
మాధవీ లత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలలో నటించి.. ప్రస్తుతం రాజకీయ రంగప్రవేశం చేసింది. అలాగే తరచూ సోషల్ మీడియా వేదికలలో మెరుస్తూ తనకు తోచినట్లుగా.. రాజకీయ నాయకులపై, సనీ ప్రముఖలపై సెటైర్లు వేస్తూనే ఉంటుంది. తాజాగా మాధవీ లత పేస్‌బుక్‌లో చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వివరాళ్లోకెళితే.. తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్, నిర్మాత దిల్ రాజుల పెళ్లిలు జరిగాయి. లాక్‌డౌన్ నేఫథ్యంలో అతికొద్ది మంది అతిథులను మధ్యలో వారి వివాహాలు జరిగాయి. ఈ నేఫథ్యంలో మాధవీలత చేసిన పోస్టు వైరల్ అవుతుంది. మాధవీ లత పోస్టులో.. అస్సలు ఆగట్లేదుగా జనాలు.. మాస్కులు వేసుకుని పెళ్లిల్లు ఎందుకు? ముహుర్తం మళ్లీ రాదా..? ఇది పోతే శ్రావణం కాకపోతే మాఘమాసం.. లేకుంటే వచ్చే సంవత్సరం.. పిళ్ల దొరకదా లేక పిల్లాడు మారిపోతాడా..? అలా మారిపోయే మనుఫులతో బంధాలు ఎందుకు? మాస్కు ముసుగులో పెళ్లిలు ఎందుకు.. కొన్నాళ్లు ఆగలేని సంసారాలు చేస్తారా..? ఫిక్స్ అయిన పెళ్లిల్లో గ్యాప్ వస్తే.. నిజాలు తెలిసే బంఫర్ ఆఫర్ మిస్ అవుతున్నారు. సచ్చపోతా నాయనా అంటే.. ఈ పెళ్లీల్లు ఎందిరో అంటూ తనదైన శైలిలో సెటైర్లు సంధించింది. చివర్లో.. గమనిక : నా పోస్టు నా ఇష్టం.. నా ఒపీనియన్ నా ఇష్టం.. నాకు నా భావాలను వ్యక్త పరిచే హక్కుంది అంటూ సెటైరాస్త్రం సంధించింది.
అయితే.. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ పోస్టు ఇటీవల పెళ్లి చేసుకున్న నిఖిల్, దిల్ రాజులను ఉద్దేశించి చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అప్పటికీ ఓ అభిమాని ఈ పోస్టు హీరో నిఖిల్ పెళ్లి గురించా అని ప్రశ్నించగా.. మాధవీ లత ఏమో అంటూ సమాధానాన్ని దాటవేసింది. కొంతమంది మాధవీలత పోస్టును సమర్థిస్తుంటే, కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. ఇదిలావుంటే.. మే 14న హీరో నిఖిల్, డాక్టర్ పల్లవీ వర్మల వివాహం జరగగా.. మే 10న నిర్మాత దిల్ రాజ్.. వైఘా రెడ్డిని వివాహమాడారు.