పుట్టినరోజు నాడు కూడా అనసూయను ప్రశాంతంగా ఉండనివ్వలేదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 May 2020 6:38 AM GMT
పుట్టినరోజు నాడు కూడా అనసూయను ప్రశాంతంగా ఉండనివ్వలేదు

మే 15.. యాంకర్ అనసూయ పుట్టినరోజు. ఆరోజు కొన్ని సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. తన భర్త తో కలిసి కీసర మండలం లోని 100 మంది గర్భిణి స్త్రీ లకు న్యూట్రిషన్ కిట్స్‌ని పంపిణీ చేశారు. కీస‌ర‌లోని చీర్యాల ప్రాంతంలో ఉన్న‌ ఫంక్ష‌న్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో సీపీ మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న అనసూయ అభిమానులతో ముచ్చటించాలని అనుకుంది.

నిన్నటి సాయంత్రం తన అభిమానులతో ముచ్చటించాలని సిద్ధమైంది. మంచి స్టైలిష్ బట్టలు వేసుకుని తన పిల్లలను పక్కన పెట్టుకుని అభిమానులతో ముచ్చటించడానికి కూర్చుంది. కొద్దిసేపు అన్ని విషయాలను చెప్పుకుంటూ వచ్చింది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి ధన్యవాదాలు తెలిపింది.

అప్పుడు కరెక్ట్ గా కొందరు ఆకతాయిలు లైవ్ లో కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. నువ్వు నీ డ్రెస్ అంటూ ఆమెపై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు పిల్లలకు తల్లివి.. వెనకాలే నీ భర్త ఉన్నాడు.. అయినా కూడా అలాంటి బట్టలు వేసుకున్నావేంటి అంటూ ఆమెను రెచ్చగొట్టేలా కామెంట్లు చేశాడు. అనసూయని ఎవరైనా కామెంట్లు చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఉంటుంది. గతంలో కూడా చాలా మందికి అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి కూడానూ..! పుట్టినరోజు నాడు కూడా ఆమెను రెచ్చగొట్టడంతో నేను ఏ బట్టలు వేసుకుంటే నీకేంట్రా, నువ్వు ఎవడ్రా నాకు చెప్పడానికి అని అనసూయ కోపం కట్టలు తెంచుకుంది. పాపం ప్రశాంతంగా పుట్టినరోజు నాడు అభిమానులతో మాట్లాడాలని అనుకున్న అనసూయను కొందరు కావాలనే రెచ్చగొట్టారు.

Next Story